సమయం తిన్న గణితం!

జేఈఈ మెయిన్స్‌ పరీక్షల తొలి రోజైన మంగళవారం రెండు విడతల్లోనూ గణితం నుంచి ఎక్కువ సమయం పట్టే ప్రశ్నలు వచ్చాయి.

Published : 25 Jan 2023 04:43 IST

భౌతిక శాస్త్రం కాస్త నయం..
జేఈఈ మెయిన్స్‌ తొలిరోజు పరీక్షలపై నిపుణుల అభిప్రాయం

ఈనాడు, అమరావతి: జేఈఈ మెయిన్స్‌ పరీక్షల తొలి రోజైన మంగళవారం రెండు విడతల్లోనూ గణితం నుంచి ఎక్కువ సమయం పట్టే ప్రశ్నలు వచ్చాయి. భౌతిక శాస్త్రం మధ్యస్థంగా, రసాయన శాస్త్రం తేలికగా ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. గణితంలో కొన్ని ప్రాథమిక భావనల ఆధారంగా ప్రశ్నలు వచ్చాయి. భౌతిక శాస్త్రంలో ఇంటర్‌ రెండో ఏడాది సిలబస్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ నుంచి 3 నుంచి 4 థియరీ ప్రశ్నలు ఇచ్చారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఈ పరీక్షల్లో మంచి స్కోరు సాధించగలుగుతారని శ్రీచైతన్య జేఈఈ సమన్వయకర్త ఉమాశంకర్‌ తెలిపారు. జాతీయ స్థాయి ర్యాంకుల్లో గణితం, రసాయన శాస్త్రం కీలకం కానున్నాయని వెల్లడించారు. ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉదయం పేపర్‌లో 290కిపైగా, రెండో సెషన్‌లో 285పైగా మార్కులు సాధించే అవకాశం ఉందని తెలిపారు. ‘మధ్యాహ్న సెషన్‌లో గణితం, రసాయన శాస్త్రంలో కొన్ని ప్రశ్నలు కష్టంగా ఉన్నాయి. గణితంలో బహుళ సంభావ్యత ప్రశ్నల కారణంగా చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు’ అని శారద విద్యా సంస్థల జనరల్‌ మేనేజర్‌ జి.విఘ్నేశ్వరరావు తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు