వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేకం

రాష్ట్రంలోని వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగానికి వ్యతిరేకమని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయ మంత్రి దేవుసింహ్‌ చౌహాన్‌ విమర్శించారు.

Published : 25 Jan 2023 04:43 IST

వైన్స్‌, మైన్స్‌పై రాష్ట్రం ఆధారపడింది
కేంద్ర మంత్రి దేవుసింహ్‌ చౌహాన్‌ ధ్వజం

కర్నూలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగానికి వ్యతిరేకమని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయ మంత్రి దేవుసింహ్‌ చౌహాన్‌ విమర్శించారు. ఆయన మంగళవారం కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వైన్స్‌, మైన్స్‌పై ఆధారపడి పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. సుపరిపాలన అందించడంలో సీఎం జగన్‌ విఫలమయ్యారని, కేంద్రం ఇచ్చే నిధులను తమ పేరుతో పథకాలకు వాడుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉందని, ప్రభుత్వోద్యోగులకు జీతాలూ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించారు. లక్షల్లో ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం నిధులిస్తే ఈ ప్రభుత్వం పూర్తి చేయకపోగా.. కనీస వసతులు కల్పించడంలోనూ విఫలమైందని విమర్శించారు. కేంద్రం పారిశ్రామిక కారిడార్‌ మంజూరు చేస్తే భూములిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని