అడ్డులేకున్నా.. అడ్డంగా నరికేస్తున్నారు

విశాఖ శారదాపీఠం రోడ్డులో చెట్ల నరికివేత మంగళవారం కూడా కొనసాగింది. పీఠం వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 28న సీఎం జగన్‌ ఇక్కడికి రానున్న నేపథ్యంలో అధికారులు రహదారుల సుందరీకరణ చేపట్టారు.

Published : 25 Jan 2023 04:43 IST

శారదాపీఠం రోడ్డులో ఆగని విధ్వంసం

పెందుర్తి, న్యూస్‌టుడే: విశాఖ శారదాపీఠం రోడ్డులో చెట్ల నరికివేత మంగళవారం కూడా కొనసాగింది. పీఠం వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 28న సీఎం జగన్‌ ఇక్కడికి రానున్న నేపథ్యంలో అధికారులు రహదారుల సుందరీకరణ చేపట్టారు. ఇందులో భాగంగా చినముషిడివాడ స్వాగతం ద్వారం సమీపంనుంచి శారదాపీఠం వరకు రహదారి మధ్యలోని డివైడర్‌లో ఉన్న పూల మొక్కలను నరికేశారు. అవి అడ్డులేకున్నా నేలకూలాయి. ఇక్కడ డివైడర్‌ వెడల్పు 40సెంటీమీటర్లు మాత్రమే ఉందని, అందులో ఉన్న మొక్కలు ఏపుగా పెరిగితే గోడలు దెబ్బతినే అవకాశం ఉందని జీవీఎంసీ ఉద్యాన విభాగం డీడీ దామోదర్‌ తెలిపారు. ఈదురు గాలులకు విరిగిపడే అవకాశం ఉందని, వీటి స్థానంలో కొత్తగా గడ్డి పెంచుతామన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు