ఎన్టీఆర్ వంటి నాయకుడు అవసరం
ప్రస్తుత రాజకీయాల్లో ఎన్టీఆర్ వంటి నాయకుడు అవసరమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్, న్యూస్‌టుడే: ప్రస్తుత రాజకీయాల్లో ఎన్టీఆర్ వంటి నాయకుడు అవసరమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకల్లో భాగంగా శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్‌వెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో.. సినీ నటుడు, జయభేరి సంస్థల అధినేత ఎం.మురళీమోహన్‌కు ‘ఎన్టీఆర్ సిల్వర్ క్రౌన్ నట పురస్కారం-2023’, బీమా పాలసీదారులకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ గుర్తింపు సాధించిన కౌటికె విఠల్‌కు ‘ఎన్టీఆర్ శ్రమశక్తి’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని స్థాపించిన 9 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో సీల్‌వెల్ కార్పొరేషన్ ఛైర్మన్ బండారు సుబ్బారావు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా, దర్శకులు రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
అలా చేస్తే.. 2030 కల్లా భారత్ దివాలా తీయడం ఖాయం: హరియాణా సీఎం కీలక వ్యాఖ్యలు
-
World News
Chinese spy balloon: అమెరికా అణ్వాయుధ స్థావరంపై చైనా నిఘా బెలూన్..!
-
Politics News
Kotamreddy: అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్.. ఆషామాషీగా జరగదు: కోటంరెడ్డి
-
India News
Air India Express: గగనతలంలో ఇంజిన్‌లో మంటలు.. విమానానికి తప్పిన ముప్పు
-
Movies News
K Vishwanath: కె.విశ్వనాథ్ ఖాకీ దుస్తుల వెనుక కథ ఇది!
-
Movies News
K Viswanath: విశ్వనాథ వారి కలం.. అవార్డులు వరించిన ఈ ఐదు చిత్రాలు ఎంతో ప్రత్యేకం..!