అర్హత లేకపోయినా వసూలు చేసిన బీమా ప్రీమియాన్ని వెనక్కివ్వాలి

ఆర్టీసీలోని సాధారణ మరణాలకు సంబంధించి ఎస్‌బీఐ గ్రూప్‌ టర్మ్‌ లైఫ్‌ బీమా కవరేజ్‌ కింద అర్హత లేని ఉద్యోగుల నుంచి రికవరీ చేసిన మొత్తాన్ని వెనక్కి ఇప్పించాలని నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ (ఎన్‌ఎంయూఏ) ఓ ప్రకటనలో కోరింది.

Published : 25 Jan 2023 05:33 IST

ఈనాడు, అమరావతి: ఆర్టీసీలోని సాధారణ మరణాలకు సంబంధించి ఎస్‌బీఐ గ్రూప్‌ టర్మ్‌ లైఫ్‌ బీమా కవరేజ్‌ కింద అర్హత లేని ఉద్యోగుల నుంచి రికవరీ చేసిన మొత్తాన్ని వెనక్కి ఇప్పించాలని నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ (ఎన్‌ఎంయూఏ) ఓ ప్రకటనలో కోరింది. గత ఏడాది జనవరి నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి ఈ బీమా కవరేజ్‌ వర్తించబోదని, అయినా సరే ప్రతి నెలా ప్రీమియం కింద నెలకు రూ.200 చొప్పున 1,991 మంది ఉద్యోగుల జీతాల నుంచి ఇప్పటివరకు రూ.51.76 లక్షలు అన్యాయంగా రికవరీ చేశారని పేర్కొంది. దీనిని ఆయా ఉద్యోగులకు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని ఆర్టీసీ ఎండీని కోరినట్లు తెలిపింది.

ఆర్టీసీ హయ్యర్‌ పింఛన్‌ ఎంపికకు అవకాశమివ్వాలి

ఈపీఎఫ్‌-95 పింఛనులో భాగంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు, పదవీవిరమణ చేసిన వాళ్లకు హయ్యర్‌ పింఛను కోసం జాయింట్‌ ఆప్షన్‌ సౌకర్యం కల్పించాలని ఎన్‌ఎంయూఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని