ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రం దారి మళ్లించింది

గ్రామ పంచాయతీలకు 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా కేంద్రం విడుదల చేసిన రూ.7,669 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించి సొంత పథకాలకు వినియోగించుకుందని పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి ఆరోపించారు.

Published : 25 Jan 2023 05:33 IST

పంచాయతీలకు తిరిగి ఇప్పించండి
కేంద్ర మంత్రికి పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినతి

కర్నూలు నగరం (జడ్పీ), న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీలకు 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా కేంద్రం విడుదల చేసిన రూ.7,669 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించి సొంత పథకాలకు వినియోగించుకుందని పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం కర్నూలులో సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి దేవుసింహ్‌ చౌహాన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల అనుమతి లేకుండా వాడుకుందని చెప్పారు. ఫలితంగా గ్రామాల్లో కనీస వసతులకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిధులను తిరిగి పంచాయతీల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని బిర్రు ప్రతాపరెడ్డి తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సర్పంచుల సంఘం జిల్లా కార్యదర్శి భాగ్యరత్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్వరగౌడ్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రవీణ్‌, వరలక్ష్మి తదితరులు ఉన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని