Andhra News: ఆయన అవినీతి రారాజు.. ఈయన భూ బకాసురుడు!
దేవాదాయశాఖలోని ఇద్దరు గెజిటెట్ అధికారుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు వారి వాట్సప్ గ్రూప్‌లో హోరెత్తాయి.
అధికారుల వాట్సప్ గ్రూప్‌లో విమర్శల పరంపర
దేవాదాయ శాఖలో ఇద్దరు అధికారుల మధ్య పోరు
ఈనాడు, అమరావతి: దేవాదాయశాఖలోని ఇద్దరు గెజిటెట్ అధికారుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు వారి వాట్సప్ గ్రూప్‌లో హోరెత్తాయి. ఒక ట్రస్టుకు చెందిన భూములు ప్రైవేటుపరం అయ్యేందుకు సహకారం అందించారనే ఆరోపణలపై ఓ అధికారి ఇటీవల సస్పెండ్ అయ్యారు. ఈ అంశంపై విచారణ చేసిన ఉన్నతాధికారిని లక్ష్యంగా చేసుకొని ఆయన పాత వీడియోను వైరల్ చేయడం, దీనిపై ఉన్నతాధికారి కూడా స్పందించి... సస్పెండైన అధికారి గత చరిత్రను బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే...
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ఓ ట్రస్టుకు చెందిన రూ.కోట్ల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు దక్కేలా అక్కడి దేవాదాయ అధికారి సహకారం అందించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కమిషనర్ ఆదేశాలతో ఓ ఉన్నతాధికారి విచారణ జరిపి నివేదిక అందజేశారు. దీంతో విచారణ చేసిన ఉన్నతాధికారిపైనే... ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. దాంతో అధికారి తీరు సరిగా లేదని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ కమిషనర్లు గ్రహించారు. ట్రస్టు భూమి విషయంలో వచ్చిన ఆరోపణలు ప్రాథమికంగా వాస్తవమని గుర్తించి, ఆయన్ని సస్పెండ్ చేశారు. దీంతో ఈ కేసులో విచారణ చేసిన ఉన్నతాధికారిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు మొదలయ్యాయి.
ఆ ఉన్నతాధికారి ఏడేళ్ల కిందట ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఏసీబీ కేసులో ఇరుక్కున్నారంటూ ‘అవినీతి రారాజు’ అనే పేరుతో అప్పటి వీడియోను తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయించి, అధికారుల గ్రూప్‌లో పోస్టు చేశారు. దీంతో ఆ ఉన్నతాధికారి కూడా స్పందించారు. ఏడేళ్ల కిందటి అంశాన్ని ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ప్రసారం చేయించారని, ఇదంతా సస్పెండైన అధికారే చేయిస్తున్నారని ఆరోపించారు. ఆ అధికారి భూబకాసురుడని, ఏ జిల్లాలో పోస్టింగ్ పొందినా అక్కడి దేవాదాయ భూములు పరాధీనం చేస్తాడనేది అందరికీ తెలుసని, ఒక ఆలయంలో పూజల పేరిట రూ.85 లక్షలు దిగమింగాడని నలుగురు సీనియర్ అధికారులు సైతం నివేదికలు ఇచ్చారంటూ అందులో వివరించారు. ఈ వాట్సప్ చాటింగ్‌పై దేవాదాయ శాఖలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. చివరికి గ్రూప్ నుంచి ఆ ఉన్నతాధికారి వైదొలిగినట్లు తెలిసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!