ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది

ప్రజాస్వామ్య పురోగమనానికి నాంది పలికే శక్తి ఓటు హక్కుకు ఉందని, ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పిలుపునిచ్చారు.

Published : 26 Jan 2023 06:16 IST

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

విజయవాడ (విద్యాధరపురం), న్యూస్‌టుడే: ప్రజాస్వామ్య పురోగమనానికి నాంది పలికే శక్తి ఓటు హక్కుకు ఉందని, ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) ముఖేష్‌ కుమార్‌ మీనా ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌ మాట్లాడుతూ.. ఓటు హక్కు అమూల్యమైందన్నారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం యువత చిత్తశుద్ధితో ఓటు హక్కును వినియోగించుకుని ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదై ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ముఖేష్‌కుమార్‌ మీనా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 68.57శాతం మంది ఓటర్ల నుంచి ఆధార్‌ సేకరించామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఓటు హక్కు ప్రాధాన్యంపై చేసిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఓటర్ల జాబితా రూపొందించడంలో ఉత్తమ సేవలందించిన కలెక్టర్లు, ఉన్నతాధికారులు, బీఎల్వోలకు గవర్నర్‌ జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని