రైతు భరోసా కేంద్రాల్లోనే ఆక్వా కొనుగోళ్లు
రైతు భరోసా కేంద్రాల్లోనే ఆక్వా ఉత్పత్తుల కొనుగోలు జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర ఎలా తీసివేశామో.. అలాగే ఆక్వా రంగంలోనూ మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించాలి.
పశుసంవర్థక సేవలకు వాలంటీర్లు
సమీక్షలో ముఖ్యమంత్రి జగన్
పశువైద్య అంబులెన్సుల ప్రారంభం
ఈనాడు, అమరావతి: రైతు భరోసా కేంద్రాల్లోనే ఆక్వా ఉత్పత్తుల కొనుగోలు జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర ఎలా తీసివేశామో.. అలాగే ఆక్వా రంగంలోనూ మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించాలి. ప్రస్తుత సీజన్లోనే దీనిపై దృష్టి పెట్టాలి..’ అని నిర్దేశించారు. ‘రైతు భరోసా కేంద్రాల్లో పశుసంవర్థకశాఖ సహాయకుని సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఒకరిద్దరు వాలంటీర్లను పశువైద్య సేవల్లో నిమగ్నం చేయాలి. ప్రతి పశువుకు ఆరోగ్యకార్డు ఇచ్చే దిశగా ఆలోచన చేయాలి..’ అని సూచించారు. పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలపై క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. ‘వైద్యఆరోగ్యశాఖలో మండలానికి 2ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక విలేజి క్లినిక్ తరహాలోనే.. పశుసంవర్థకశాఖలోనూ పటిష్ఠమైన అంచెల వారీ విధానం తీసుకురావాలి. పశువుల అంబులెన్స్‌లపై ప్రత్యేక శ్రద్ద చూపాలి’ అని ఆదేశించారు. పశుపోషకులకు కాల్‌సెంటర్, సహాయకుని నంబర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. సహకార రంగంలో ఆక్వాలో ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన చేయాలన్నారు. ఆక్వాలో విత్తన, దాణా ధరల నియంత్రణకు రూపొందించిన చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
రెండు, మూడు వారాల్లో చిత్తూరు డెయిరీ శంకుస్థాపన
చిత్తూరు డెయిరీ పునరుద్ధరణలో భాగంగా రెండు, మూడు వారాల్లో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ‘పాలల్లో రసాయనాలు కలుస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలి’ అని చెప్పారు.
15 నాటికి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను పూర్తి చేస్తాం
ఫిబ్రవరి 15వ తేదీ నాటికి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ‘నిజాంపట్నం, ఉప్పాడ, మచిలీపట్నంలోనూ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రతి త్రైమాసికానికి ఒకటి చొప్పున డిసెంబరు నాటికి అందుబాటులోకి వస్తాయి. రెండో దశలో నిర్మిస్తున్న వాడరేవు, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, బియ్యపుతిప్ప హార్బర్ల నిర్మాణానికి అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. మొత్తం 9 ఫిషింగ్ హార్బర్లకు రూ.3,520.57కోట్లు ఖర్చు చేస్తున్నాం...’ అని వారు వివరించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 4,765 పశుసంవర్థక సహాయకుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పశు వైద్య అంబులెన్సుల ప్రారంభం
సంచార పశు ఆరోగ్యసేవలో భాగంగా 165 పశు అంబులెన్స్ వాహనాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రూ.111.62 కోట్ల వ్యయంతో వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు పశుసంవర్థకశాఖ అధికారులు వివరించారు. మంత్రి సీదిరి అప్పలరాజు, అగ్రిమిషన్ వైస్‌ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎం.హనుమంతరావు, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాల గిరి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు
-
Ap-top-news News
Andhra News: నారాయణ.. వాలంటీర్ ఇవన్నీ విద్యార్హతలేనట!
-
Ap-top-news News
AP High Court: అభ్యంతరముంటే ‘బిగ్‌బాస్’ చూడొద్దు: హైకోర్టు
-
General News
Tirumala: వైభవంగా రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై శ్రీవారి దర్శనం
-
Politics News
Andhra News: యువగళం.. వారాహి యాత్రల ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉంటుంది: ఎంపీ రఘురామ
-
Crime News
Andhra News: అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ వాలంటీరు