ఏబీడీఎంలో రాష్ట్రానికి 5 జాతీయ అవార్డులు

ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఏబీడీఎం) కార్యక్రమ నిర్వహణలో రాష్ట్రానికి మూడు విభాగాల్లో 5 జాతీయ అవార్డులు లభించాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

Published : 26 Jan 2023 05:00 IST

ఈనాడు, అమరావతి: ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఏబీడీఎం) కార్యక్రమ నిర్వహణలో రాష్ట్రానికి మూడు విభాగాల్లో 5 జాతీయ అవార్డులు లభించాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. త్వరలో దిల్లీలో జరిగే కార్యక్రమంలో అధికారులు ఈ అవార్డులు స్వీకరించనున్నారు. ప్రతి లక్ష జనాభాకు సంబంధించి అత్యధిక హెల్త్‌ రికార్డులను ఏబీహెచ్‌ఏ (ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అథారిటీ)తో అనుసంధానం చేయడంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాల స్థాయిలో ఏలూరు, విశాఖపట్నం, పల్నాడు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఏబీహెచ్‌ఏ ఖాతాల ఏర్పాటుతో ఏడీబీఏం కింద వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపు, ఇతర చర్యల్లోనూ రాష్ట్రం ముందంజలో ఉందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ‘రాష్ట్రంలో 3,68,58,465 మందికి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్లను జారీ చేశాం. 3,79,720 హెల్త్‌ రికార్డులను ఏబీడీఎంకు అనుసంధానించాం. 14,505 ఆరోగ్య వ్యవస్థలను, 21,200 ఆరోగ్య నిపుణుల పేర్లను రిజిస్టర్‌ చేశాం’ అని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని