ఇతర రాష్ట్రాల్లోనూ విద్యుత్ సబ్సిడీ అకౌంటింగ్ విధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు నిర్వహిస్తున్న సబ్సిడీ అకౌంటింగ్ విధానాన్ని ఇతర రాష్ట్రాలూ అనుసరించాలని కేంద్రం ఇతర రాష్ట్రాల డిస్కంలకు సూచించిందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు.
కేంద్రం సూచించిందన్న విజయానంద్
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు నిర్వహిస్తున్న సబ్సిడీ అకౌంటింగ్ విధానాన్ని ఇతర రాష్ట్రాలూ అనుసరించాలని కేంద్రం ఇతర రాష్ట్రాల డిస్కంలకు సూచించిందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు. విద్యుత్ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) అమలుపై సోమ, మంగళవారాల్లో కేంద్రం దిల్లీలో రెండు రోజుల పాటు నిర్వహించిన అవగాహన సమావేశానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన విధానాలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించినట్లు చెప్పారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వినియోగించిన విద్యుత్‌ను ప్రతి నెలా లెక్కించి.. ఆ మేరకు బిల్లును డిస్కంలు గత 6 నెలలుగా పంపుతున్నాయి. గతంలో ఎస్సీ, ఎస్టీ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు వినియోగించిన విద్యుత్‌కు పక్కా లెక్కలు లేకుండా సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి వసూలు చేసేవి. దీంతో పాటు విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను 11.8 శాతానికి తగ్గించడానికి తీసుకున్న చర్యలను వివరించాం...’ అని ఆయన పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు
-
Crime News
Crime News: చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు
-
Ap-top-news News
Andhra News: నారాయణ.. వాలంటీర్ ఇవన్నీ విద్యార్హతలేనట!
-
Ap-top-news News
AP High Court: అభ్యంతరముంటే ‘బిగ్‌బాస్’ చూడొద్దు: హైకోర్టు
-
General News
Tirumala: వైభవంగా రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై శ్రీవారి దర్శనం