ఒత్తిళ్లు తగ్గి... పెరిగిన పోటీ!

శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌- బెంగళూరు హైవేలోని కోడూరు జంక్షన్‌ వరకు విస్తరించనున్న ఎన్‌హెచ్‌-342 టెండరులో భారీ పోటీ నెలకొంది. 47 కిలోమీటర్లను 4 వరుసలుగా రూ.990 కోట్లతో విస్తరించేందుకు కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (మోర్త్‌) టెండర్లు పిలిచింది.

Published : 26 Jan 2023 05:19 IST

పుట్టపర్తి-కోడూరు రహదారి విస్తరణ.. టెండరులో 17 సంస్థలు
అంచనా ధరకంటే తక్కువకే పనులు జరిగే అవకాశం

ఈనాడు, అమరావతి: శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌- బెంగళూరు హైవేలోని కోడూరు జంక్షన్‌ వరకు విస్తరించనున్న ఎన్‌హెచ్‌-342 టెండరులో భారీ పోటీ నెలకొంది. 47 కిలోమీటర్లను 4 వరుసలుగా రూ.990 కోట్లతో విస్తరించేందుకు కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (మోర్త్‌) టెండర్లు పిలిచింది. దీనికి ఏకంగా 17 సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు తేల్చారు. ఈ ప్యాకేజీలో వివిధ నియోజకవర్గాల పరిధిలో పనులు చేయాల్సి ఉండటంతో నిర్వహణ భారం ఎక్కువ అవుతుందని నేతలు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాజకీయ ఒత్తిళ్లు లేకపోవడంతో పెద్ద ఎత్తున సంస్థలు ముందుకొచ్చినట్లు సమాచారం. అధిక పోటీ కారణంగా గుత్తేదారు సంస్థలు అంచనా ధర కంటే తక్కువకే కోట్‌ చేస్తాయని అధికారులు భావిస్తున్నారు. ముందుగా వీటిలో సాంకేతిక అర్హత ఉన్న సంస్థలను మోర్త్‌ ఖరారు చేస్తుంది. తర్వాత వాటి ధరల బిడ్లను తెరుస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని