రథసప్తమి వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

తిరుమలలో శనివారం రథ సప్తమిని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో బుధవారం జేెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహ కిశోర్‌తో కలిసి వివిధ విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు.

Published : 26 Jan 2023 05:19 IST

28న ఆర్జిత సేవల రద్దు
తితిదే ఈవో ధర్మారెడ్డి

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో శనివారం రథ సప్తమిని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో బుధవారం జేెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహ కిశోర్‌తో కలిసి వివిధ విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ... మినీ బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి వేడుకలను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. సప్త వాహనాలపై స్వామి ఊరేగనున్నట్లు తెలిపారు. 28న తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్లను రద్దు చేశామని, భక్తులు ఆ రోజు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2 ద్వారా స్వామి వారిని దర్శనం చేసుకోవాలని కోరారు. వీఐపీ బ్రేక్‌, ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు తదితర ప్రత్యేక దర్శనాలూ రద్దు చేశామన్నారు. ఈనెల 27, 28 తేదీల్లో వసతి గదుల ముందస్తు బుకింగ్‌ రద్దు చేశామని తెలిపారు.

రేపు ఆన్‌లైన్‌లో శ్రీవాణి టికెట్ల జారీ

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి నెల శ్రీవాణి టికెట్లను శుక్రవారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. రోజూ వెయ్యి టికెట్ల చొప్పున జారీ చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని