Nellore KGF: నెల్లూరు కేజీఎఫ్‌.. ప్రకృతి సంపదను కొల్లగొట్టి..

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరు పరిధిలోనిదీ చిత్రం. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను రాత్రి పగలు తేడా లేకుండా తవ్వి తరలించడంతో ఏర్పడిన గుంతలివి.

Updated : 26 Jan 2023 07:40 IST

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరు పరిధిలోనిదీ చిత్రం. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను రాత్రి పగలు తేడా లేకుండా తవ్వి తరలించడంతో ఏర్పడిన గుంతలివి. సర్వే నంబరు 920లో సుమారు 2591.77 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇదంతా కనిగిరి రిజర్వాయరుది. ఈ భూములు 22ఏ జాబితాలో ఉన్నాయి.

గ్రావెల్‌ నిల్వలు ఎక్కువగా ఉండటంతో వైకాపా నాయకుల కన్ను పడింది. ప్రకృతి సంపదను కొల్లగొట్టి జేబులు నింపుకొంటున్నారు. ఈ క్రమంలో ‘ఈనాడు’లో వచ్చిన వరుస కథనాలు, స్థానికుల ఫిర్యాదుతో ఎట్టకేలకు భూగర్భ, గనులశాఖ అధికారులు కదిలారు. ఇప్పటి వరకు ఎంత అనుమతి తీసుకున్నారు? ఎంత తవ్వారు? అనే అంశాలపై సర్వే చేస్తున్నారు. ఆ క్రమంలో తీసిన డ్రోన్‌ చిత్రాన్ని చూసి విస్తుబోయారు. రూ.వందల కోట్ల మట్టిని తరలించినట్లు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని