1001 దీపాలు వెలిగించి పూజలు

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని గురువారం రాత్రి తెదేపా నాయకులు 1001 దీపాలను వెలిగించారు.

Published : 27 Jan 2023 04:16 IST

కనిగిరి, న్యూస్‌టుడే: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని గురువారం రాత్రి తెదేపా నాయకులు 1001 దీపాలను వెలిగించారు. స్థానిక అమరావతి గ్రౌండ్‌లో మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జగన్‌ రాక్షస పాలనకు చరమ గీతం పాడి, చంద్రబాబును గెలిపించడమే ధ్యేయంగా లోకేశ్‌ చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రజలను నాయకులు కోరారు. 400 రోజులు, 4 వేల కిలోమీటర్లు అంటూ వెలిగించిన దీపాలు ఆకట్టుకున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు