గృహ నిర్మాణశాఖ శకటానికి ప్రథమ బహుమతి

గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని శకటాలు, కవాతు ప్రదర్శన నిర్వహించారు. గృహ నిర్మాణశాఖకు చెందిన ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ శకటానికి ప్రథమ, పాఠశాల విద్యాశాఖ శకటానికి ద్వితీయ, గ్రామ-వార్డు సచివాలయాలశాఖ శకటానికి తృతీయ బహుమతి లభించాయి.

Published : 27 Jan 2023 04:16 IST

గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని శకటాలు, కవాతు ప్రదర్శన నిర్వహించారు. గృహ నిర్మాణశాఖకు చెందిన ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ శకటానికి ప్రథమ, పాఠశాల విద్యాశాఖ శకటానికి ద్వితీయ, గ్రామ-వార్డు సచివాలయాలశాఖ శకటానికి తృతీయ బహుమతి లభించాయి. కవాతు ప్రదర్శనకు సంబంధించి సాయుధ విభాగం ఇండియన్‌ ఆర్మీ కంటింజెంట్‌ ప్రథమ బహుమతి, ఏపీఎస్పీ కర్నూలు బెటాలియన్‌ ద్వితీయ బహుమతి సాధించగా... సాయుధేతర విభాగంలో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కంటింజెంట్‌ ప్రథమ, ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ద్వితీయ బహుమతి సాధించాయి. ఈ విభాగాల ప్రతినిధులకు గవర్నర్‌ పురస్కారాలు అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు