పండగ రోజూ పార్టీ రంగేనా!

జాతీయ పండగ నాడు పరేడ్‌ నిర్వహించే మైదానంలోనూ వైకాపా జెండా తరహా రంగులే కనిపించాయి. గుంటూరులోని పరేడ్‌ గ్రౌండ్‌లో గురువారం గణతంత్ర వేడుకలు నిర్వహించారు.

Published : 27 Jan 2023 04:16 IST

జాతీయ పండగ నాడు పరేడ్‌ నిర్వహించే మైదానంలోనూ వైకాపా జెండా తరహా రంగులే కనిపించాయి. గుంటూరులోని పరేడ్‌ గ్రౌండ్‌లో గురువారం గణతంత్ర వేడుకలు నిర్వహించారు. అధికారులు అందుకు ముందుగానే ఏర్పాట్లు చేశారు. ఏ అధికారి ఆలోచనోగానీ.. మైదానం మధ్యలో పరేడ్‌ కమాండర్‌ నడిచే మార్గాన్ని నీలం, పచ్చ రంగులతో నింపారు. వేడుకలకు వచ్చిన ప్రజలు ఇది చూసి పండగ రోజూ పార్టీ రంగులేనా అని విస్తుబోయారు.

 ఈనాడు, గుంటూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు