గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఈ నెల 8వ తేదీన ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగింది.

Published : 28 Jan 2023 03:16 IST

ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక
ఏప్రిల్‌ 23 నుంచి 29వ తేదీ వరకు ప్రధాన పరీక్షలు
ఏపీపీఎస్సీ వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఈ నెల 8వ తేదీన ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష రాసిన వారిలో నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తం 6,455 మందిని ప్రధాన పరీక్ష రాసేందుకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. ప్రధాన పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. వాస్తవానికి గ్రూప్‌-1 కింద అన్ని రకాలు భర్తీ చేయాల్సిన పోస్టులు 111 ఉన్నాయి. దీని ప్రకారం 5,550 మందిని ప్రధాన పరీక్షలకు ఎంపిక చేయాలి. కానీ... ఒకరి కంటే ఎక్కువ మందికి ఒకే మార్కులు రావడం, సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలోనూ సంఖ్య పెరిగిందని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని