స్థానిక సంస్థల్లో ఖాళీలకు 3న ఎన్నికలు

పల్నాడు జిల్లాలోని దాచేపల్లి నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌ స్థానం సహా రాష్ట్రంలోని ఏడు మండల పరిషత్‌ అధ్యక్ష, 11 ఉపాధ్యక్ష, 6 కో-ఆప్షన్‌ సభ్యుల, 30 ఉప సర్పంచుల ఖాళీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం వేర్వేరుగా మూడు నోటిఫికేషన్లు జారీ చేసింది.

Updated : 28 Jan 2023 06:02 IST

ఈనాడు-అమరావతి: పల్నాడు జిల్లాలోని దాచేపల్లి నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌ స్థానం సహా రాష్ట్రంలోని ఏడు మండల పరిషత్‌ అధ్యక్ష, 11 ఉపాధ్యక్ష, 6 కో-ఆప్షన్‌ సభ్యుల, 30 ఉప సర్పంచుల ఖాళీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం వేర్వేరుగా మూడు నోటిఫికేషన్లు జారీ చేసింది. పదవులకు రాజీనామా చేయడం, మృతి చెందడం వంటి కారణాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈనెల 30లోగా ఎంపీటీసీ సభ్యులకు, పంచాయతీ వార్డు సభ్యులకు, కౌన్సిలర్లకు సమాచారం పంపి ఫిబ్రవరి 3న ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది. అనివార్య కారణాలతో 3న సమావేశం నిర్వహించలేకపోతే 4న ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్‌ అధ్యక్షులను, ఉపాధ్యక్షులను, వార్డు సభ్యులు ఉప సర్పంచులను, కౌన్సిలర్లు ఛైర్‌పర్సన్‌ను చేతులెత్తి ఎన్నుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని