పద్మశ్రీ గొరిపర్తి ఇక లేరు

పద్మశ్రీ అవార్డు గ్రహీత గొరిపర్తి నరసింహరాజుయాదవ్‌(86) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Published : 28 Jan 2023 04:01 IST

గూడూరు, న్యూస్‌టుడే: పద్మశ్రీ అవార్డు గ్రహీత గొరిపర్తి నరసింహరాజుయాదవ్‌(86) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన పార్థివదేహాన్ని కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని నివాసం నుంచి స్వగ్రామమైన గూడూరు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు. సినిమా థియేటర్‌ నిర్వహిస్తున్నా.. మొదటి నుంచీ వ్యవసాయం పట్ల మక్కువ చూపేవారు. ఉత్తమ రైతుగా 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇండియన్‌ కౌన్సిల్‌ సభ్యునిగా, నేషనల్‌ యూరియా న్యూప్రైస్‌ ఫిక్సింగ్‌ కమిటీ, ఇండియన్‌ రైస్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌, ఐకార్‌ కృషి విజ్ఞానకేంద్రాల కమిటీ, హైటాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఆన్‌ ఆర్గానిక్‌ ఫామింగ్‌, తదితర రాష్ట్ర, జాతీయస్థాయి కమిటీల్లో సభ్యునిగా సేవలు అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు