రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ అదానీకే ఎందుకు ఇస్తున్నారు

ఆర్థిక రంగంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు అదానీ సంస్థలో పని చేస్తున్నప్పటికీ సెబీ, ఈడీ, సీబీఐ, డీఆర్‌ఐ వంటి కేంద్ర సంస్థలు పట్టించుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రొఫెషనల్స్‌ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు ఆరోపించారు.

Published : 28 Jan 2023 04:01 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రొఫెషనల్స్‌ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు

ఈనాడు, అమరావతి: ఆర్థిక రంగంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు అదానీ సంస్థలో పని చేస్తున్నప్పటికీ సెబీ, ఈడీ, సీబీఐ, డీఆర్‌ఐ వంటి కేంద్ర సంస్థలు పట్టించుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రొఫెషనల్స్‌ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు ఆరోపించారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ విడుదల చేసిన  నివేదిక, వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల   ఆధారంగా మేం ఓ నివేదిక తయారు చేశాం. గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ అనేక బినామీ సంస్థల ద్వారా విదేశాల నుంచి తమ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. వాటికి అడ్డదారుల్లో ఆర్థిక వనరులను సృష్టిస్తున్నట్లు హిండెన్‌బర్గ్‌ నివేదిక స్పష్టంచేసింది. అదానీ సంస్థల్లో అది నిర్దేశించిన దాని కంటే ఎక్కువగా ఉంది’ అన్ని అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం, కృష్ణపట్నం పోర్టులు గౌతమ్‌ అదానీకి కట్టబెట్టడం వెనుక మతలబు ఏంటో చెప్పాలి. అధికార, ప్రతిపక్ష నాయకులెవరూ అదానీని ఎందుకు ఎదిరించడంలేదు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో డబ్బులు గుమ్మరిస్తూ... అనేక ప్రాజెక్టులకు అక్రమంగా అనుమతులు పొందుతున్నారు’  అని మహేశ్వరరావు ఆరోపించారు. సమావేశంలో ప్రొఫెషనల్స్‌ ఫోరం సంయుక్త కార్యదర్శి పావులూరి ఖాజారావు, న్యాయవాది శ్రీనివాసరావు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు