ఉపాసనశక్తితో శారదాపీఠం నిర్మితం

విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అయిదు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు మహాగణపతి పూజతో అంకురార్పణ చేశారు.

Published : 28 Jan 2023 04:01 IST

స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి

విశాఖపట్నం(పెందుర్తి), న్యూస్‌టుడే: విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అయిదు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు మహాగణపతి పూజతో అంకురార్పణ చేశారు. పీఠం అధిష్ఠాన దేవత రాజశ్యామల అమ్మవారి యాగానికి శ్రీకారం చుట్టారు. తితిదే ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీనివాస చతుర్వేద హవనాన్ని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాములు ప్రారంభించారు. విద్యా, వ్యాపార వృద్ధి కోరుతూ మేధా దక్షిణామూర్తి హోమం నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి మాట్లాడుతూ శారదాపీఠం పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి కాదని, ఉపాసనా శక్తితో నిర్మితమైందన్నారు. వార్షికోత్సవాల్లో భాగంగా తొలిరోజు చాత్తాద శ్రీవైష్ణవ ఆగమ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ కొంతమంది ఆచార్యులు పనిగట్టుకుని ఆగమాల నిర్వహణలో విభేదాలు సృష్టిస్తున్నారని చెప్పారు. తమిళనాడులో ఆగమ విధానాలు బాగా అమలవుతున్నాయని, ఉత్తర భారతంలో అసలు అమలులో లేవన్నారు. అవగాహన లోపంతో ఆంధ్రరాష్ట్రంలో వాటిని పాటించే అర్చకులు కరవయ్యారన్నారు. సదస్సులో చిర్రావూరి శ్రీరామశర్మ, ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని