టీటీదేవస్థానమ్స్‌ మొబైల్‌ యాప్‌ ప్రారంభం

భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టీటీదేవస్థానమ్స్‌ పేరుతో రూపొందించిన మొబైల్‌ యాప్‌ను తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

Updated : 28 Jan 2023 06:41 IST

దర్శనం, సేవా టికెట్లతో పాటు సమస్త సమాచారం

తిరుమల, న్యూస్‌టుడే: భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టీటీదేవస్థానమ్స్‌ పేరుతో రూపొందించిన మొబైల్‌ యాప్‌ను తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. స్థానిక అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడారు. భక్తుల కోసం ఇప్పటివరకు గోవింద యాప్‌ ఉండేదని, దీన్ని ఆధునికీకరించి మరిన్ని అప్లికేషన్లు పొందుపరిచి నూతన యాప్‌ను రూపొందించామని తెలిపారు. దీని ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవలు బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. విరాళాలు కూడా అందించవచ్చని పేర్కొన్నారు. ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా చూడవచ్చన్నారు. తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం ఈ యాప్‌లో ఉంటుందని, జియో సహకారంతో తితిదే ఐటీ విభాగం దీన్ని రూపొందించినట్లు వివరించారు. తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. డిజిటల్‌ గేట్‌వేగా ఈ యాప్‌ ఉపయోగపడుతుందని తెలిపారు. భక్తులు లాగిన్‌ అయ్యేందుకు యూజర్‌ నేమ్‌తో పాటు ఓటీపీ ఎంటర్‌ చేస్తే చాలని, పాస్‌వర్డ్‌ అవసరం లేదన్నారు.

శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులు వాయిదా

తిరుమల శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను ఐదు నుంచి ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నామని, త్వరలోనే మరో తేదీ నిర్ణయిస్తామని తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని