తూర్పు తీరంలో భద్రతకు చర్యలు

తూర్పు తీరంలో భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లను అధిగమించేందుకు తీర రక్షణ దళం చేపట్టిన వివిధ కార్యక్రమాలను తూర్పు తీర రక్షక దళ కమాండర్‌, అదనపు డైరక్టర్‌ జనరల్‌ శివమణి పరమేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు.

Published : 28 Jan 2023 04:59 IST

ఈనాడు, అమరావతి: తూర్పు తీరంలో భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లను అధిగమించేందుకు తీర రక్షణ దళం చేపట్టిన వివిధ కార్యక్రమాలను తూర్పు తీర రక్షక దళ కమాండర్‌, అదనపు డైరక్టర్‌ జనరల్‌ శివమణి పరమేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంని శుక్రవారం ఆయన కలిసి పలు అంశాలను ప్రస్తావించారు. కోస్ట్‌గార్డ్‌ డీఐజీ యోగేంధర్‌ ఢాకా, కమాండెంట్‌ కె.మురళీ, డిప్యూటీ కమాండెంట్‌ ఏబీ శ్రీరామం ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

రాజీలేని ధోరణి కొనసాగించాలి: గవర్నర్‌

దేశ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని, దేశ భద్రత విషయంలో రాజీలేని ధోరణిని కొనసాగించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తీర ప్రాంత రక్షణ దళ అధికారులను కోరారు. ఈ దళ అధికారుల బృందం శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు