నాబార్డు సాయంతో చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం: సీఎం

నాబార్డు సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 29 Jan 2023 04:50 IST

ఈనాడు, అమరావతి: నాబార్డు సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే తోడ్పాటు అందించాలని కోరారు. నాబార్డు ఛైర్మన్‌ షాజీ శనివారం ముఖ్యమంత్రిని కలిశారు. నాబార్డు సాయంతో చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వివిధ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు దోహదపడుతున్నాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, నాబార్డు ప్రతినిధులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు