మార్చి రెండో వారంలో శాసనసభ సమావేశాలు!

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను మార్చి రెండో వారంలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైనట్లు తెలిసింది.

Published : 29 Jan 2023 04:50 IST

ఈనాడు, అమరావతి: శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను మార్చి రెండో వారంలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైనట్లు తెలిసింది. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ జరగనుంది. దాని తర్వాతే శాసనసభ సమావేశాలను పూర్తిస్థాయిలో చేపట్టాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందంటున్నారు. తొలుత ఫిబ్రవరి నెలాఖరునే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి 21 లేదా 22 పనిదినాలను చేపట్టాలని భావించారు. అయితే... పెట్టుబడుల సదస్సు తర్వాతే సమావేశాలను నిర్వహించాలన్న ప్రతిపాదన వైపే ప్రభుత్వం మొగ్గు చూపిందంటున్నారు. మార్చి రెండో వారంలో సమావేశాలను మొదలుపెట్టి నెలాఖరు వరకు కొనసాగిస్తారని లేదంటే మూడో వారం చివర్లోనే ముగించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని