సప్త వాహనాలపై శ్రీనివాసుడు

రథసప్తమి మహోత్సవం సందర్భంగా తిరుమల శ్రీనివాసుడు శనివారం సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై తిరు వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు.

Updated : 29 Jan 2023 06:35 IST

తిరుమల, న్యూస్‌టుడే: రథసప్తమి మహోత్సవం సందర్భంగా తిరుమల శ్రీనివాసుడు శనివారం సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై తిరు వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. కరోనా అనంతరం మొదటిసారిగా శ్రీవారి రథసప్తమి మహోత్సవాన్ని భక్తుల సమక్షంలో నిర్వహించడంతో భారీగా తరలివచ్చారు. ఉషోదయాన సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన సప్తవాహన సేవోత్సవం రాత్రి చంద్రప్రభ వాహనంతో దేదీప్యమానంగా పరిసమాప్తమైంది. మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీసుదర్శన చక్రత్తాళ్వారులకు చక్రస్నానాన్ని శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు నిర్వహించారు. వాహన సేవల ముందు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. భక్తుల రద్దీ కారణంగా కొన్నిచోట్ల స్వల్పంగా తోపులాటలు చోటుచేసుకున్నాయి. దాదాపు రెండు లక్షల మంది భక్తులు ఉత్సవానికి హాజరైనట్లు తితిదే అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని