Taraka Ratna: విషమంగానే తారకరత్న ఆరోగ్యం

చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.

Updated : 29 Jan 2023 09:50 IST

నారాయణ హృదయాలయకు వచ్చిన చంద్రబాబు, కుటుంబీకులు

ఈనాడు, బెంగళూరు: చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కుప్పం నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించాక వైద్యులు అత్యున్నత సేవలందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై శనివారం మధ్యాహ్నం బులెటిన్‌ విడుదల చేశారు. మయోకార్డియల్‌ ఇన్‌ఫార్క్‌షన్‌ కారణంగా తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారని.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సాయంత్రం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు వచ్చారు. తారకరత్న తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్య తదితరులతో మాట్లాడారు. తారకరత్న ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, కోలుకునేందుకు మరింత సమయం అవసరమని తెలుస్తోందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరుకు చేరుకున్న సినీనటుడు బాలకృష్ణ వైద్యులతో చర్చించారు. దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి సుహాసిని, ఎమ్మెల్యే చినరాజప్ప, తెదేపా నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల శ్రీరామ్‌ తదితరులు ఆసుపత్రికి వచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు