పాదయాత్రల విషయంలో పారదర్శకం

పాదయాత్రల విషయంలో పోలీసుశాఖ పారదర్శకంగా వ్యవహరిస్తోందని డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 29 Jan 2023 03:21 IST

మార్చి ఆఖరుకు పోలీసుల టీఏ, డీఏ, ఇతర బకాయిల విడుదల: డీజీపీ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పాదయాత్రల విషయంలో పోలీసుశాఖ పారదర్శకంగా వ్యవహరిస్తోందని డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాదయాత్ర చేయాలంటే జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌లో అనుమతి తీసుకోవాలని చెప్పారు. జీవో 1 గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జీవో వచ్చిన తర్వాతా రాజకీయ పార్టీల సమావేశాలకు అనుమతులిచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో గంజాయిని అడ్డుకునే దిశగా చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. పోలీసు సిబ్బందికి రావాల్సిన సరెండర్‌ లీవ్స్‌, టి.ఎ., డి.ఎ., ఎరియర్స్‌ను మార్చి నెలాఖరుకు విడుదల చేస్తామని చెప్పారు. కానిస్టేబుల్‌ రాత పరీక్ష, ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. డీఐజీ జి.పాలరాజు, ఎస్పీ యు.రవిప్రకాశ్‌ పాల్గొన్నారు. రాష్ట్ర పోలీసుల పని తీరుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని డీజీపీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో.. వివిధ రాష్ట్రాల పోలీసులపై ప్రజల విశ్వాసం, సమర్థత, నిజాయతీలపై వివరాలను సేకరించారని, ఈ జాబితాలో ఏపీ తొలి స్థానంలో నిలిచిందని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు