అరసవల్లిలో వైభవంగా రథసప్తమి

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో రథసప్తమి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. సూర్యనారాయణస్వామి నిజరూపంలో దర్శనమిచ్చారు.

Published : 29 Jan 2023 04:22 IST

శ్రీకాకుళం సాంస్కృతికం, అరసవల్లి, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో రథసప్తమి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. సూర్యనారాయణస్వామి నిజరూపంలో దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, నగేష్‌ శర్మ నిర్వహణలో విశేష అర్చనలు, సేవలు జరిపారు. దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌.. స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. వీఐపీల క్యూలైన్‌లోకి పోలీసులు, అధికారుల కుటుంబాలను అనుమతించడంతో.. భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. దీనిపై పలువురు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని