శారదాపీఠంలో రాజశ్యామల యాగం

విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం రాజశ్యామల యాగం నిర్వహించారు. పీఠంలో జరిగిన పూజల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Published : 29 Jan 2023 04:22 IST

పాల్గొన్న గవర్నర్లు, మంత్రులు

పెందుర్తి, న్యూస్‌టుడే: విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం రాజశ్యామల యాగం నిర్వహించారు. పీఠంలో జరిగిన పూజల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పంజాబ్‌, తమిళనాడు గవర్నర్లు బన్వారీలాల్‌ పురోహిత్‌, రవీంద్ర నారాయణ రవి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కే రోజా పాల్గొని పీఠాధిపతుల ఆశీర్వచనాలను తీసుకున్నారు. రథసప్తమిని పురస్కరించుకుని పీఠంలో సౌర యాగం, అరుణ పారాయణం, సూర్య నమస్కారాలు చేశారు. తితిదే ఆధ్వర్యంలో చేపట్టిన చతుర్వేద హవనం సంప్రదాయబద్ధంగా కొనసాగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు