సీఎం వస్తున్నారని పచ్చదనంపై రంపం వేటు

ముఖ్యమంత్రి జగన్‌ భద్రత పేరుతో ఆర్టీసీ బస్టాండు రోడ్డులో డివైడర్‌ మధ్యలో ఏపుగా పెరిగిన పచ్చని చెట్లను అడ్డంగా నరికేశారు.

Published : 29 Jan 2023 04:22 IST

వినుకొండ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ భద్రత పేరుతో ఆర్టీసీ బస్టాండు రోడ్డులో డివైడర్‌ మధ్యలో ఏపుగా పెరిగిన పచ్చని చెట్లను అడ్డంగా నరికేశారు. చేదోడు కార్యక్రమంలో లబ్ధిదారులకు మూడో విడత ఆర్థిక సాయం విడుదల చేసేందుకు 30న సీఎం పల్నాడు జిల్లా వినుకొండ వస్తున్నారు. ఈ సందర్భంగా భద్రత పేరుతో అధికారులు చెట్లను శనివారం రాత్రి రంపంతో కోయించారు. సీఎం వెళ్లే మార్గంలో సుమారు 50కిపైగా చెట్లను ఇలా నరికేశారు. భద్రత సిబ్బంది సూచనల మేరకు తొలగిస్తున్నామని మున్సిపల్‌ డీఈఈ వెంకయ్య తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు