ప్రభుత్వ స్థలంలో రేకుల షెడ్డు నిర్మాణం

అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు ఆగ్రహించారు... అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోనందుకు సచివాలయ కార్యాలయానికి తాళం వేశారు.

Published : 29 Jan 2023 04:22 IST

నిరసనగా సచివాలయానికి తాళం వేసిన గ్రామస్థులు

చౌటభీమవరం (అనుమసముద్రంపేట), న్యూస్‌టుడే: అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు ఆగ్రహించారు... అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోనందుకు సచివాలయ కార్యాలయానికి తాళం వేశారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట మండలంలోని చౌటభీమవరంలో శనివారం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి గ్రామంలోని సీజేఎఫ్‌ఎస్‌ భూమి సర్వే నంబరు 436లో అక్రమంగా రేకుల షెడ్డు నిర్మిస్తున్నారు. సర్పంచి లక్ష్మీనరసయ్య... అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందన లేకపోవడంతో శనివారం గ్రామస్థులతో కలిసి సచివాలయ భవనానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఏఎస్‌పేట ఎస్సై నరేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని సర్పంచి, గ్రామస్థులతో మాట్లాడారు. నచ్చజెప్పి తాళాలు తీయించారు. ఈ విషయమై తహసీల్దారు సుభద్ర మాట్లాడుతూ... సిబ్బందిని విచారణకు పంపించి, నివేదిక కోరామని తెలిపారు. ‘భూ ఆక్రమణలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేస్తున్నా తెలియదని చెప్పడం విడ్డూరంగా ఉంది’ అని సర్పంచి లక్ష్మీనరసయ్య చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని