పెళ్లిలో మిగిలిన అల్పాహారమే మధ్యాహ్న భోజనం

వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలోని పాల్‌రెడ్డి ప్రాథమిక పాఠశాలలో శనివారం మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందలేదు.

Published : 29 Jan 2023 04:24 IST

పులివెందుల, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలోని పాల్‌రెడ్డి ప్రాథమిక పాఠశాలలో శనివారం మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందలేదు. పెళ్లింట అల్పాహారంగా మిగిలిన పొంగలిని వడ్డించి సరిపెట్టారు. మెనూ ప్రకారమైతే.. అన్నం, సాంబారు, తీపి పొంగలి వడ్డించాల్సి ఉంది. పాఠశాల సమీపంలోని ఓ ఫంక్షన్‌హాలులో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో మిగిలిన పొంగలిని విద్యార్థులకు వడ్డించారు. ముద్దగా మారిన ఆ పొంగలిని తినలేక పిల్లలు ఇబ్బందిపడ్డారు. చాలామంది పస్తులతోనే తరగతులకు హాజరయ్యారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించేలా చర్యలు తీసుకుంటామని, పొంగలి పెట్టడంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎంఈవో వీరారెడ్డి వివరణ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు