షార్‌కు చేరిన 36 వన్‌వెబ్‌ ఉపగ్రహాలు

వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలు తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)కు శనివారం చేరుకున్నాయి.

Published : 29 Jan 2023 04:31 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలు తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)కు శనివారం చేరుకున్నాయి. ఫ్లోరిడాలో రూపొందించిన ఈ ఉపగ్రహాలు చెన్నై విమానాశ్రయానికి రాగా.. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో షార్‌కు తరలించారు. వీటిని మార్చిలో ఎల్‌వీఎం-3 వాహకనౌక ద్వారా ప్రయోగించనున్నారు. యూకే ఆధారిత శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సంస్థ వన్‌వెబ్‌, ఇస్రో న్యూ స్పేస్‌ ఇండియా మధ్య వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ ప్రయోగం చేపడుతున్నారు. మొదటి దశలో భాగంగా ఇప్పటికే 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. వీటిద్వారా దేశంలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలు మే నాటికి అందుబాటులోకి రానున్నాయి. మన దేశానికి చెందిన భారతి ఎంటర్‌ప్రైజెస్‌ వన్‌వెబ్‌లో ప్రధాన వాటాదారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని