సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ

ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు.

Updated : 29 Jan 2023 05:50 IST

ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. శనివారం శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ... ‘ప్రభుత్వానికి ఎంతగా సహకరిస్తున్నా సమస్యలపై చొరవ చూపకపోవడం బాధాకరం. కరోనా విధులు నిర్వహిస్తూ మృతిచెందిన కుటుంబాలకు పరిహారం చెల్లింపు, ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం విఫలమైంది. సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాలను ఒకే వేదికపైకి తీసుకొస్తాం. ఈ మేరకు ఫిబ్రవరి 5న కర్నూలులో జరిగే మూడో రాష్ట్ర సమావేశంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం’ అని ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు