Andhra News: మా భూమిని లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా..సెల్ఫీ వీడియో తీసి యువరైతు అదృశ్యం

‘వివాదం పరిష్కారం కాకుండా మా భూమిని లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా. దీనంతటికీ కారణం వైకాపా నాయకులే’ అని ఓ యువ రైతు సెల్ఫీ వీడియోను సామాజిక మాధ్యమంలో పెట్టి కనిపించకుండా పోయారు.

Updated : 30 Jan 2023 07:48 IST

ఇందుకు వైకాపా నాయకులే కారణం
సెల్ఫీ వీడియోలో యువరైతు

చేజర్ల, న్యూస్‌టుడే: ‘వివాదం పరిష్కారం కాకుండా మా భూమిని లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా. దీనంతటికీ కారణం వైకాపా నాయకులే’ అని ఓ యువ రైతు సెల్ఫీ వీడియోను సామాజిక మాధ్యమంలో పెట్టి కనిపించకుండా పోయారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పాతపాడులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెంచల నరసింహారెడ్డి తండ్రి అల్లంపాటి పెంచలరెడ్డి, బెంగళూరుకు చెందిన డి.పట్టాభిరామిరెడ్డికి మధ్య కొన్నాళ్లుగా సాగు భూమి విషయంలో వివాదం నడుస్తోంది. ఆదివారం పట్టాభిరామిరెడ్డి వర్గీయులు స్థానిక వైకాపా నాయకుల సాయంతో ఆ భూమిలో విత్తనాలు నాటేందుకు యత్నించారు. ఇది గమనించిన పెంచల నరసింహారెడ్డి కూలీలను పొలం నుంచి పంపించారు. వివాదం పరిష్కారం కానంత వరకూ ఎవరైనా పొలంలోకి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. పోలీసులు వచ్చి ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఈ క్రమంలోనే పెంచల నరసింహారెడ్డి ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ‘తమ పొలాన్ని ఆక్రమించేందుకు వైకాపా నాయకుల అండతో ప్రత్యర్థులు ప్రయత్నం చేస్తున్నారు. నా చావుకు వైకాపా నాయకులు, పోలీసులే బాధ్యులు’ అని అందులో పేర్కొని ఫోన్‌ను ఇంట్లో వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. భూ ఆక్రమణ వ్యవహారంలో మా మద్దతు ఎవరికీ లేదని ఎస్సై స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు