చిట్టి మొక్కకు.. బుట్టెడు కాయలు

ఈ మొక్క.. దానికున్న కాయలు చూస్తుంటే.. ఏదో అలంకరణ కోసం పెట్టిన సామగ్రిలా ఉంది కదూ! కానీ, ఇది నిజమైన మొక్కే.

Published : 30 Jan 2023 03:38 IST

ఈ మొక్క.. దానికున్న కాయలు చూస్తుంటే.. ఏదో అలంకరణ కోసం పెట్టిన సామగ్రిలా ఉంది కదూ! కానీ, ఇది నిజమైన మొక్కే. ఆకులు ఉన్నాయా? లేవా? అన్నట్లు ఉన్న ఈ మూడు అడుగుల మొక్కకు 150 నుంచి 200 వరకు కమలా కాయలు కాయడం అబ్బురపరుస్తోంది. ఆ పక్కనే ఉన్న మరో దానికి 20 నుంచి 50 కాయలు ఉన్నాయి. నెల్లూరు నగరంలోని కేవీఆర్‌ పెట్రోల్‌ బంకువద్ద ఉన్న నర్సరీలో ఈ బోన్సాయ్‌ మొక్క అందరినీ ఆకర్షిస్తోంది. వీటిని థాయ్‌లాండ్‌ నుంచి తీసుకువచ్చినట్లు నిర్వాహకుడు తెలిపారు. కాయలు కూడా ఎంతో రుచిగా ఉంటాయని వివరించారు.

 ఈనాడు, నెల్లూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని