నేడు మూడో విడత ‘జగనన్న చేదోడు’

రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు సంబంధించి ‘జగనన్న చేదోడు’ మూడో విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం విడుదల చేయనున్నారు.

Published : 30 Jan 2023 03:38 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు సంబంధించి ‘జగనన్న చేదోడు’ మూడో విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం విడుదల చేయనున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించే కార్యక్రమంలో 3,30,145 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.330.15 కోట్లను బటన్‌ నొక్కి జమ చేయనున్నారు. ఈ పథకం కింద రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. అత్యంత పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయాలద్వారా అర్హుల జాబితాను ఎంపిక చేసి పథక లబ్ధిని అందిస్తున్నామని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. మూడో విడతతో కలిపి ఇప్పటివరకూ రూ.927.39 కోట్ల లబ్ధి చేకూర్చినట్లు అవుతుందని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని