Andhra News: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఒబెరాయ్‌ సంస్థకు 40 ఎకరాలు!

భోగాపురం విమానాశ్రయానికి మార్చిలో శంకుస్థాపన జరగనున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో పలు సంస్థల ప్రముఖులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు.

Updated : 30 Jan 2023 10:25 IST

భోగాపురం, తగరపువలస- న్యూస్‌టుడే: భోగాపురం విమానాశ్రయానికి మార్చిలో శంకుస్థాపన జరగనున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో పలు సంస్థల ప్రముఖులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయ ప్రతిపాదిత స్థల సమీపంలో ఉన్న దిబ్బలపాలెం, అన్నవరం సరిహద్దుల్లోని 40 ఎకరాలను ఒబెరాయ్‌ హోటల్‌కు ఏపీ టూరిజం ఇవ్వనుందనే ప్రచారం నేపథ్యంలో ఆదివారం ఆ సంస్థ సీఈవో, ఎండీ విక్రమ్‌ ఒబెరాయ్‌, కార్పొరేట్‌ వ్యవహారాల ప్రెసిడెంట్‌ రాజారామన్‌ శంకర్‌, చీఫ్‌ ఫైనాన్స్‌ అధికారి కల్లోల్‌ కుందు, విశాఖ కలెక్టరు మల్లికార్జునరావు, ఆర్డీవో భాస్కరరెడ్డి, తహసీల్దారు కోరాడ వేణుగోపాల్‌ తదితరులు సందర్శించారు. ముందుగా పరిశీలించిన స్థలంలో బీచ్‌కు సుమారు 300 మీటర్ల దూరంతోపాటు, బీచ్‌ కారిడార్‌కు ఆనుకుని ఉండే అంశాలపై మ్యాప్‌ పరిశీలన చేశారు. భూమి ఎత్తుపల్లాలు, పర్యావరణ అనుకూలతలపై విశాఖ జిల్లా స్థాయి అధికారులతో వారు సమీక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు