తెలుగు లిపి.. అప్పుడలా.. ఇప్పుడిలా

అ, ఆ, ఇ, ఈ.. అంటూ తెలుగు భాషలో ప్రస్తుతం మనం అనుసరిస్తున్న వర్ణమాలలోని ఒక్కో అక్షరం శతాబ్దాల తరబడి ఎన్నెన్నో మార్పులకు లోనవుతూ వచ్చింది.

Published : 30 Jan 2023 06:49 IST

అ, ఆ, ఇ, ఈ.. అంటూ తెలుగు భాషలో ప్రస్తుతం మనం అనుసరిస్తున్న వర్ణమాలలోని ఒక్కో అక్షరం శతాబ్దాల తరబడి ఎన్నెన్నో మార్పులకు లోనవుతూ వచ్చింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో మౌర్య చక్రవర్తుల కాలం నుంచి క్రీస్తుశకం 16వ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయల కాలం వరకు అనేక రకాలుగా మారుతూ వచ్చింది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, గుప్తులు, శాలంకాయనులు, పల్లవులు రాజ్యమేలిన కాలంలో తెలుగు-కన్నడ-తమిళ లిపుల సామీప్యత, అక్షరమాలలో పరిణామ క్రమానికి అద్దం పట్టేలా ఓ బోర్డును నిజామాబాద్‌లోని తిలక్‌గార్డెన్‌ పురావస్తు ప్రదర్శనశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సందర్శకులను ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది.

 ఈనాడు, నిజామాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని