పెట్టుబడులే లక్ష్యంగా రోడ్‌షోలు

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా మంగళవారం నుంచి గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రోడ్‌షోలు  నిర్వహించనున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

Published : 31 Jan 2023 03:13 IST

మంత్రి అమర్‌నాథ్‌

విశాఖపట్నం (అక్కిరెడ్డిపాలెం), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా మంగళవారం నుంచి గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రోడ్‌షోలు  నిర్వహించనున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. సోమవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళవారం దిల్లీలో జరిగే తొలి రోడ్‌షోలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. విశాఖలో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సుకు పెట్టుబడుదారులను ఆహ్వానించేందుకు ఈ రోడ్‌షోలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సుమారు 45 దేశాలకు చెందిన ప్రతినిధులను సదస్సుకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని