శారదాపీఠాన్ని సందర్శించిన హరియాణా గవర్నర్‌

వేద పోషణ కోసం విశాఖ శారదా పీఠం చేస్తున్న కృషి మరువలేనిదని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కొనియాడారు.వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఆయన పీఠాన్ని సందర్శించారు.

Published : 31 Jan 2023 05:05 IST

పెందుర్తి, న్యూస్‌టుడే: వేద పోషణ కోసం విశాఖ శారదా పీఠం చేస్తున్న కృషి మరువలేనిదని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కొనియాడారు.వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఆయన పీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తితిదే ఆధ్వర్యంలో జరుగుతున్న చతుర్వేద హవనం, సచ్చిదానంద విద్వత్‌, శాస్త్ర, శ్రౌత సభలకు హాజరయ్యారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాములను కలుసుకున్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ రాష్ట్రంలో మంచి వాతావరణం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం శారదాపీఠం ముద్రించిన మాండ్యుకోపనిషత్‌ గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. గవర్నర్‌తో పాటు ఎమ్మెల్సీ పీవీఎన్‌.మాధవ్‌, చాగంటి ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు