జాతి సమగ్రతకు గాంధీమార్గం అనుసరణీయం

జాతి సమగ్రత, ఐక్యతను కాపాడేందుకు మహాత్మాగాంధీ అనుసరించిన శాంతియుత మార్గం అందరికీ ఆదర్శనీయమని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు.

Published : 31 Jan 2023 05:05 IST

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ఈనాడు, అమరావతి: జాతి సమగ్రత, ఐక్యతను కాపాడేందుకు మహాత్మాగాంధీ అనుసరించిన శాంతియుత మార్గం అందరికీ ఆదర్శనీయమని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. సోమవారం రాజ్‌భవన్‌లో మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్ముడి చిత్ర పటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాష్‌, ఉప కార్యదర్శి నారాయణస్వామి పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని