కుల, మత భేదాలు లేకుండా సాగటమే మహాత్ముడికి నివాళి

కుల, మత భేదాలకు చోటివ్వకుండా కలసికట్టుగా ప్రగతిపథంలో నడవడమే మహాత్ముడికి మనమిచ్చే నివాళి అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.

Published : 31 Jan 2023 05:05 IST

తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్‌ 

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కుల, మత భేదాలకు చోటివ్వకుండా కలసికట్టుగా ప్రగతిపథంలో నడవడమే మహాత్ముడికి మనమిచ్చే నివాళి అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో.. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
జట్టు విజయంలో విశాఖ అమ్మాయి ఉండటం గర్వకారణం: క్రికెట్‌ అండర్‌-19 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత అమ్మాయిల జట్టులో విశాఖపట్నానికి చెందిన షబ్నమ్‌ ఉండటం రాష్ట్రానికి గర్వకారణమని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు