Andhra News: ఎవరీ నవీన్‌?.. అవినాష్‌రెడ్డి కాల్‌డేటాతో పేరు బహిర్గతం

మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన నవీన్‌పై సర్వత్రా చర్చ సాగుతోంది.

Updated : 01 Feb 2023 08:55 IST

వివేకా హత్య కేసు దర్యాప్తు నేపథ్యంలో సర్వత్రా చర్చ

ఈనాడు డిజిటల్‌, కడప: మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన నవీన్‌పై సర్వత్రా చర్చ సాగుతోంది. ఎంపీ అవినాష్‌రెడ్డి ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా ఈ పేరు వెల్లడైంది. నవీన్‌ కుటుంబ సభ్యులు పులివెందులలోని రాజారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరు సీఎం జగన్‌ తాత రాజారెడ్డి దగ్గర పని చేసేవారు. నవీన్‌ చదువుకుంటూ జగన్‌కు దగ్గరయ్యారు. జగన్‌తోపాటు వెళ్లి బెంగళూరు, హైదరాబాద్‌లో లోటస్‌ పాండ్‌లో ఆయన దగ్గర పని చేశారు.

అనంతరం జగన్‌ కుటుంబం తాడేపల్లికి మకాం మారినప్పుడు ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు 15 ఏళ్లుగా వారితోనే ఉంటున్నారు. జగన్‌ సతీమణి భారతికి విధేయుడిగా ఉంటూ ఇంటి పనులన్నీ చేసి పెడుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి వివేకా మరణానంతరం నవీన్‌కు అవినాష్‌రెడ్డి పలుమార్లు ఫోన్‌ చేసినట్లు కాల్‌డేటా ఆధారంగా సీబీఐ గుర్తించింది. దాంతో ఆయనపై సీబీఐ దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అతని మొదటి పేరు హరిప్రసాద్‌ కాగా... నవీన్‌గా మార్చుకున్నట్లు తెలుస్తోంది.

సీబీఐ అధికారులు సైతం సోమవారం పులివెందులలో హరిప్రసాద్‌ పేరిటే ఆరా తీశారు. ఇదిలా ఉండగా పులివెందులలో కొత్తగా కారు కనిపిస్తే సీబీఐ అధికారులుగా భావించి హడావుడి కనిపిస్తోంది. అనుమానిత వ్యక్తులెవరూ బయట కనిపించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని