Andhra News: బాలిక కడుపు నుంచి కిలోకు పైగా జుత్తు తొలగింపు

ఓ బాలిక పొట్ట నుంచి కిలోకు పైగా జుత్తు తొలగించిన సంఘటన కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీరామా నర్సింగ్‌ హోమ్‌లో చోటుచేసుకుంది.

Updated : 01 Feb 2023 10:12 IST

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ఓ బాలిక పొట్ట నుంచి కిలోకు పైగా జుత్తు తొలగించిన సంఘటన కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీరామా నర్సింగ్‌ హోమ్‌లో చోటుచేసుకుంది. బాలిక(14) అన్నం తినడంలేదని, తరచూ వాంతులు చేసుకుంటూ క్రమంగా చిక్కిపోతోందని పట్టణానికి చెందిన ఆమె తల్లిదండ్రులు 15 రోజుల క్రితం నర్సింగ్‌ హోమ్‌కు తీసుకొచ్చారు. వైద్యుడు పొట్లూరి వంశీకృష్ణ పలు పరీక్షలు చేసి ఆమెకు జుత్తు తినే అలవాటుందని గుర్తించి ఎండోస్కొపి తీయించారు. బాలిక కడుపులో కణితి మాదిరిగా జుట్టు పేరుకుపోయి కనిపించింది. దీంతో ఆమెకు మంగళవారం శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న కిలోకు పైగా బరువున్న జుత్తును తొలగించారు. రక్తహీనత వల్ల 20 ఏళ్లలోపు బాలికల్లో జుత్తు తినే అలవాటు ఉంటుందని డాక్టర్‌ పొట్లూరి వంశీకృష్ణ తెలిపారు. 15 వేల మందిలో ఒకరికి ఇలాంటి అలవాటు ఉంటుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని