భూపరిశీలన ఉపగ్రహం నిసార్‌

భారత్‌-అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన అత్యంత అధునాతన భూపరిశీలన ఉపగ్రహం ‘నిసార్‌’ ఈ ఏడాది అందుబాటులోకి రానుంది.

Updated : 01 Feb 2023 06:04 IST

నాసా-ఇస్రో సంయుక్త ఆధ్వర్యంలో తయారీ
అమెరికా నుంచి తరలింపునకు ఏర్పాట్లు

శ్రీహరికోట, న్యూస్‌టుడే: భారత్‌-అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన అత్యంత అధునాతన భూపరిశీలన ఉపగ్రహం ‘నిసార్‌’ ఈ ఏడాది అందుబాటులోకి రానుంది. 2.8 టన్నుల బరువున్న దీనిని ఈ ఏడాది సెప్టెంబరులో నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. డ్యూయల్‌ బ్యాండ్‌ పేలోడ్‌ను బుధవారం కాలిఫోర్నియాలోని నాసా జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీ (జేపీఎల్‌) నుంచి ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌ జెండా ఊపి బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్‌ సెంటర్‌కు తీసుకురానున్నారు. ఇక్కడ పూర్తిగా అనుసంధానించాక శ్రీహరికోటకు తీసుకొస్తారు. నాసా-ఇస్రో సింథటిక్‌ ఎపర్చర్‌ రాడార్‌ (నిసార్‌) అంచనా వ్యయం రూ.12,150 కోట్లు. దీని నిర్మాణానికి 2014 సెప్టెంబరులో ఇస్రో, నాసా ముందుకొచ్చాయి. యూఎస్‌కు చెందిన ఎల్‌ బ్యాండ్‌, భారత్‌కు చెందిన ఎస్‌-బ్యాండ్‌ సార్‌ను ఉపయోగించిన ఈ ఉపగ్రహం జీవితకాలం మూడేళ్లు. భూమి, మంచు ద్రవ్యరాశి, ఎత్తును ప్రతినెలా నాలుగు నుంచి ఆరుసార్లు మ్యాప్‌ చేయడానికి అధునాతన రాడార్‌ ఇమేజింగ్‌ను ఉపయోగిస్తుంది. క్రస్ట్‌ పరిణామం, స్థితికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తుంది. వాతావరణ మార్పులను  శాస్త్రవేత్తలు సులువుగా అర్థం చేసుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో విస్తృతంగా సాయపడనుంది. భూగ్రహంపై ఉన్న జీవావరణం, వాతావరణ పరిస్థితులు, మంచు పలకల పరిస్థితి, సముద్ర భూగర్భ జల మట్టాలు, సునామీ, అగ్నిపర్వత విస్ఫోటనాలు కొలిచే వీలుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు