పోలవరం విచారణ నుంచి వైదొలగిన సీజే

పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించేలా ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రరావు 2017లో దాఖలు చేసిన పిల్‌ విచారణ నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర వైదొలిగారు.

Updated : 01 Feb 2023 06:07 IST

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి ఏజీగా న్యాయ సలహా ఇచ్చానని వెల్లడి

ఈనాడు, అమరావతి: పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించేలా ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రరావు 2017లో దాఖలు చేసిన పిల్‌ విచారణ నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర వైదొలిగారు. తాను అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ)గా ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి పోలవరంపై న్యాయ సలహా ఇచ్చినందున ఈ వ్యాజ్యంపై విచారించడం భావ్యం కాదని తెలిపారు. ఇది మరో ధర్మాసనం ముందుకు వచ్చేలా చూడమని రిజిస్ట్రీని ఆదేశించారు. 2013-14 నాటి అంచనా ధరల ప్రకారమే నిధులు చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా ప్రకటించాలని కేవీపీ ఈ పిల్‌లో కోరారు. ఇందులో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అనుబంధ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. విచారణకు ఆయన కూడా హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు