మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి అరెస్ట్‌

రెండు పడకగదుల ఇళ్లను పేదప్రజలకు అప్పగించాలని కోరుతూ ఆందోళన చేస్తారనే సమాచారంతో మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళిని పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేశారు.

Updated : 01 Feb 2023 05:22 IST

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: రెండు పడకగదుల ఇళ్లను పేదప్రజలకు అప్పగించాలని కోరుతూ ఆందోళన చేస్తారనే సమాచారంతో మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళిని పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేశారు. హనుమకొండలోని అంబేడ్కర్‌నగర్‌లో ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లు నిర్మించింది.. కానీ వాటిని పంపిణీ చేయలేదు. ఆ ఇళ్లను పేదలకు ఇవ్వాలని కోరుతూ మురళి సోమవారం రాత్రి అంబేడ్కర్‌నగర్‌కు వచ్చి స్థానికులతో మాట్లాడారు. మంగళవారం ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకుని అక్కడే చర్చి సమీపంలోని ఓ ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. పోలీసులు మంగళవారం తెల్లవారుజామున బలవంతంగా తలుపులు తీసి లోపలికి వెళ్లారు. మీరు ఎలా లోపలికి వస్తారు? వారెంట్‌ ఉందా? అని మురళి ప్రశ్నించడంతో ముందస్తు అరెస్టు చేస్తున్నామని సీఐ షుకుర్‌ చెప్పారు. దీంతో వాగ్వాదం జరిగింది. తర్వాత పోలీసులు మురళితో పాటు మరికొందర్ని అరెస్టు చేసి సుబేదారి ఠాణాకు తరలించారు. వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కొందరు ప్రజాప్రతినిధులు పేదల నుంచి డబ్బులు తీసుకొని ఇళ్లు ఇస్తామని మోసం చేస్తున్నారని ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు